Categories

ఖరీదైన పట్టు చీరెలు బీరువాల్లో పెట్టేస్తాము. ఈ వర్షపు రోజుల్లో చల్లదనానికి అవి వాసన వేస్తాయి. నాప్త లిన్ ఉండలను మూటగట్టి చీరెల మధ్య పెడితే పురుగుల బెడద ఉండదు మంచి పరిమళం కూడా ఉంటుంది.ఎండు వేపాకులు మూటగట్టి చీరెల్లో పెడితే పురుగులు రాకుండా ఉంటాయి.పట్టుచీరెలను విడివిడిగా హ్యాంగర్ లకు తగిలించి వేలాడదీయాలి.ఇనుప హ్యాంగర్ల పైన రోజులతరబడి ఉంచితే తుప్పు మరకలు పడతాయి.కనుక చెక్క హ్యాంగర్ లనే వాడాలి.పట్టుచీరలు బయటికి తీసి కాసేపు ఎండ వచ్చే ప్రదేశం లో గతంలో పెట్టిన మడతలు మార్చి పెట్టాలి.ఒకే మడత లో ఎక్కువ రోజులు ఉంటే అక్కడ చిరుగులు పడిపోతాయి.మరీ ఖరీదైన జరీ చీరెలు పైటకొంగు లోపలకి మడిచి మడత వేసి తెల్లని వస్త్రంలో చీరెని చుట్టి బీరువాలో పెట్టుకోవాలి.