Categories
ఖరీదైన నూనెలు, షాంపుల కంటే చిన్న పాటి టిప్స్ శిరోజాల ఆరోగ్యానికి సహాకరిస్తాయి. ఒక అరకప్పు మినప్పప్పులో టేబుల్ స్పూన్ మెంతిగింజలు కలిసి పొడి చేసేకొని అందులో అరకప్పు పెరుగు కలిపి మాడుకు శిరోజాలకు పట్టించాలి. రెండు గంటలు అలాగే వదిలేసి కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా మెరిసిపోతుంది. వెచ్చని నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ తేనే కలిపి షాంపు కండిషనింగ్ అయ్యాక తలపైన పోసుకోని ,మళ్ళీ నీళ్ళతో కడిగేయకుండా వదిలేస్తే జుట్టు మెరిసిపోతూ పట్టు కుచ్చులా అనిపిస్తుంది. క్రమం తప్పని హాట్ ఆయిల్ థెరఫీ కూడా జుట్టుకు మంచి పోషకాలు అందేలా చేస్తుంది. కొబ్బరి ,ఆలీవ్ ఆయిల్ కలిపి మాడు శిరోజాలను మసాజ్ చేసి వేడి టవల్ తో శిరోజాలను కవర్ చేసి అరగంట తర్వాత షాంపులో స్నానం చేయవచ్చు.