సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా అనే హైట్రాడ్ పండు సృష్టించారు. తైవాన్ లో దొరికే ఈ పండు పేరు పైనాపిల్ షుగర్ ఆపిల్. మళ్ళీ తొక్కలు వుండే లక్ష్మణ ఫలాన్ని దక్షిణ అమెరికా లో బిరిబా అని పిలుస్తారు. సీతా ఫలం తో పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ. దీన్ని షుగర్ ఆపిల్ అంటారు. మహబూబ్ నగర్ ,బాలా నగర్ ,షహరాన్ పూర్ ,ఇలా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన మేలు జాతి సీతా ఫలాన్ని తియ్యని గుజ్జుతో ఉంటాయి. ఇప్పుడు హైద్రాబాద్ లో సీతా ఫలాల గుజ్జుతో చేసే ఐస్ క్రీమ్ చాలా పాపులర్ కూడా. ఈ మధురమైన సీతాఫలం లో పోషకాలు ఎక్కువే. వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలుంటాయి. ఆపిల్ .మామిడి బొప్పాయి తో పోలిస్తే ఇందులో ఎక్కువే. తక్కువ బరువు ఉంటే హాయిగా రోజుకు పండు తిని బరువు పెరగచ్చు. అరిస్టోక్రాట్ ఆఫ్ ఫ్రూట్స్ గా వేరు పడ్డ సీతా ఫలం ఔషధ విలువలు ఎంత ఎక్కువంటే సీతా ఫలం సీజన్ ఎప్పుడూ ఉంటే ఎంత బావుంటుందో అనుకునేంత అసలు సీజనల్ ఫ్రూట్స్ ఏవి దొరికినా వాటిని ఆ కాలంలో తినేయటం శరీరానికి లాభం.
Categories