ఇష్టమైన భోజనం అదీ ,ఇదనీ రూల్స్ ఏం లేవు.  హాయిగా తినేస్తాను అయితే ఏదీ అతిగా చేయను.  ఏం తిన్న వ్యాయామం తోడుగా ఉందిగా , ఎక్కువ తింటే ఎక్కువ సేపు వ్యాయామం , తక్కువ తింటే రోటీన్. శరీరాకృతి బావుండలంటే మరి తినాలి కదా? అంటోంది  కృతిసనన్. నాకు భోజనం ఇష్టం అలాగే జిమ్ లో రకరకాల వర్కవుట్స్ మార్చుతూ చేయటం ఇష్టం. వెయిట్ ట్రెయినింగ్ తో పాటు పిలెట్స్ చేస్తాను. శరీరాన్ని ట్యూన్ చేస్తాయివి.  పొట్ట, అరచేతులు కాళ్ళు, వెనుకభాగం దృఢంగా ఉండాలంటే ఇవి చేయాలి. వారంలో నాలుగైదు సార్లు వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది. కిక్ బాక్సింగ్, సల్పాడాన్స్ క్లాసులు ఇవన్ని నా వ్యాయామంలో భాగాలు. ఫ్రైడ్ ఫుడ్ పక్కన పెట్టి ఎప్పుడూ ఒకే డైట్ ప్లాన్ ఫాలో అవకుండా ఆరోగ్యకరమైన ఆహారం తింటాను అంటోంది కృతిసనన్. చక్కని సలహా తింటే తినవచ్చుఅందుకు తగడ్గ వ్యాయామం చేసి ఆరోగ్యంగా అందంగా ఉండటం మంచిదే కదా!

Leave a comment