చర్మం తేమతో,తాజాగా ఆరోగ్యంగా కనిపించేందుకు బారీ పాలిషింగ్ మార్గం అంటారు బ్యూటీ ఎక్సపర్ట్స్ సాధారణంగా స్క్రబ్బింగ్ ,క్లెన్సింగ్,మసజింగ్ విధానాలు ద్వారా పాలిషింగ్ చేస్తారు. వైద్యుల ఆధ్వర్యంలో శరీరం నిగారింపులో వుండేందుకు. మాండలిక్,గ్లైకాలిక్ యాసిడ్ వంటి పూతలు వేస్తారు. ముఖచర్మం సున్నితంగా ఉంటుంది కనుక బారీ పాలిషింగ్ శరీరానికే చేస్తారు. దాని వల్ల చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మృదువుగా కనిపిస్తుంది. చర్మ కణాలు పునరుత్తేజమై కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇంట్లో ప్రయత్నిచాలంటే వేడి నీటితో ముంచిన టూర్‌కి టవల్ తో శరీరం తుడిచి కొబ్బరి లేదా ఆలివ్ నూనెతో శరీరాన్ని మర్దన చేసుకొని,తేన పంచదార మిశ్రమం పూతలా వేసుకొని అరగంట ఆరాక కడిగేసుకోవాలి. స్నానం చేసి బాడీ లోషన్ రాసుకోవాలి.
Categories