స్మార్ట్ ఫోన్ వినియోగం పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు అత్యంత ప్రమాద కరమైన అనారోగ్యాలు తెచ్చిపెడుతున్నాయని బ్రిటన్ లోని ఓల్డ్ కేన్సర్ రివెర్ర ఫండ్ , సోఫియా లోనెస్ కేన్సర్ రిసర్చ్ ఇన్ స్టట్యూట్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి . గంటల తరబడి ఫోన్ లో వీడియోలు చూడటం ,గేమ్స్ ఆడటం దృష్టి మాంద్య లోపాలు ఒబిసిటీని తెచ్చిపెడతాయి . గంటల తరబడి కదలకుండా ఉండటం ,జంక్ ఫుడ్స్ ,తియ్యని పదార్దాలు ,చాక్లెట్స్ ,బిస్కెట్లు తినడం పిల్లలకు అనారోగ్య హేతువులుగా వాళ్ళు చెప్పుతున్నారు . వీడియోల్లో నిరంతరం వచ్చే ప్రకటనలకు పిల్లలు చాలా తేలగ్గా ఆకర్షితులౌతున్నారని ,ఎక్కువగా ఫుడ్స్ కు సంబంధించిన యాడ్స్ ఉండటం లో పిల్లల పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెపుతున్నారు .

Leave a comment