మస్కారా తో కనురెప్పలు అందంగా విశాలంగా కనిపిస్తాయి. ఒత్తుగా కనిపించాలంటే ముందు కాస్త బేబీ పౌడర్ అద్ది తర్వాత మస్కారా వేసుకోవాలి ఐలాష్ కార్లర్ ఉన్న వాడుకోవచ్చు దాంతో ముందు కనురెప్పలు నొక్కి తర్వాత మస్కారా రాసుకుంటే రెప్పలు విడివిడిగా చక్కగా కనిపిస్తాయి.పడుకునే ముందర మస్కారా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. మిగతా మేకప్ తో పోలిస్తే దీని వల్ల జరిగే హాని చాలా ఎక్కువ అది అలాగే ఉంచుకుంటే గట్టిపడి రెప్పల కు కంటికి ముప్పు తెస్తుంది. ఒకరు వాడిన మస్కారా ఇంకొకళ్ళు వాడకూడదు దీని వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది ఓపెన్ చేశాక మూడు నుంచి ఆరు నెలల కు మించి వాడకూడదు.

Leave a comment