పచ్చని చెట్లను చూస్తే మనసులో ఆందోళన తగ్గిపోతుంది అంటారు ఎక్స్ పర్డ్స్ . అలా శరీరాన్ని ,మనసునీ సేదతీర్చే వందలాది చెట్ల మధ్య  కాసేపు గడిపితే ఇంకెంత బావుండాలి . ఒత్తిడి ,ఆందోళన వంటి సమస్య  చాలా వరకు తగ్గుముఖం పడతాయి . దీన్నే ట్రీ థెరపీ అంటున్నారు . మనస్సు భారంగా అనిపిస్తే దగ్గర లోని అడవికి వెళ్ళి నలుగురు స్నేహితులతో మూడు ,నాలుగు గంటలు గడిపి రావటమే ఈ థెరపీ విధానం . మానసిక ఆరోగ్యం పైనే శారీరక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అంటారు డాక్టర్లు . కనుక రక్తపోటు ,కెన్సర్లు ,అల్సర్లు ఉన్నా వాళ్ళకు ఈ థెరపీ బాగా ఉపయోగ పడుతుందని డాక్టర్లు చెపుతున్నారు .

Leave a comment