Categories
కరోనా రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండండి అంటున్నారు డాక్టర్లు. మాస్క్ తో పాటు జన సందోహం ఉన్న చోట దూరం పాటించటం ముఖ్యం అంటున్నారు అమెరికాలోని మెక్సికో యూనివర్సిటీ పరిశోధకులు. సాధారణ క్లాత్ మాస్క్, రెండు పొరల మాస్క్,సర్జికల్ మాస్క్,ఎన్ 95 మాస్క్ కరోనా కణాలను ఎలా నివారిస్తాయి తెలుసుకునేందుకు చేసిన ప్రయోగాలు అన్ని మాస్కులు కరోనా వైరస్ వ్యాప్తిని కొంతవరకు అడ్డుకుంటాయని తేలింది. సామాజిక దూరం పాటించకపోవటం వల్లనే వైరస్ సోకే అవకాశాలు ఎక్కువని కనుగొన్నారు. మాస్క్ ఖచ్చితంగా రక్షణ ఇస్తుంది కానీ సామాజిక దూరం పాటించకపోతే వైరస్ సోకే వీలుందని చెబుతున్నారు అధ్యయనకారులు.