Categories
గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రభాస పట్టణంలో ఉంది సోమనాథ దేవాలయం. జ్యోతిర్లింగా క్షేత్రంలో ఇదోకటి. దీనిని ప్రభాస తీర్థం అంటారు. అరేబియ సముద్ర తీరాన వెలసిన పుణ్యక్షేత్రం .ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం నాలుగడుగుల ఎత్తులో ఓంకారంలో అమర్చి ఉంటుంది.సోమనాధ్లో త్రివేణి సంగమంగా ప్రసిద్ది చెందిన హిరణ్ ,సరస్వతి కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం మహా మేరు ప్రసారంగా పిలవబడే ఈ ఆలయకట్టడం ఉంటుంది చాళుక్యుల నాటి ఆలయ నిర్మాణ శైలిలో ఉంటుంది. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని చెపుతారు.