Categories
స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా స్త్రీ శక్తి ప్యాకేజీ ప్రవేశపెట్టింది.మహిళలకే ఈ రుణం లభిస్తుంది. రిటైల్,తయారి రంగం డాక్టర్ బ్యూటిషియన్,ఆర్కిటెక్ట్ ,సీఎ ఇలా తదితర రంగాలకు సంభందించి పని చేసే మహిళలు ఈ రుణం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.వర్కింగ్ క్యాపిటల్ కిందనే ఈ రుణం అందుతుంది. రిటైల్ చిన్న తరహా వ్యాపరాలు చేసుకునే వారికి యభై వేలు నుంచి రెండు లక్షల రుణం లభిస్తుంది. మధ్య తరహా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి చెందినవారికి యాభైవేల నుంచి పాతిక లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. పది లక్షల రూపాయల వరకు కొల్లాటరల్ అవసరం లేదు. వడ్డీ చాలా తక్కువ.