Categories
కళకు ఒక చక్కని భాష ఉంది.ఎన్నో ఎన్జీవో లు ప్రపంచంలో మార్పు తీసుకొచ్చేందుకు స్ట్రీట్ ఆర్ట్ ని వేదికగా తీసుకుంటున్నారు.సాటర్ డే ఆర్ట్ క్లాస్, ధారవి ఆర్ట్ రూమ్, అరవాణి ఆర్ట్ ప్రాజెక్ట్ చల్ రంగ్ దే, సుసూన్ డాక్ ఆర్ట్ ప్రాజెక్ట్ వంటివి ఇలా వచ్చినవే ఇంస్టాగ్రామ్ లో ఈ కృషి అంతా పోస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. సామాజిక విషయాలలో అవగాహన తీసుకువస్తూ గ్రామాలను రంగులతో అలంకరిస్తున్నాయి ఈ ఎన్జీవో లు. ఈ రంగుల కళ తో వీధులన్నీ వర్ణమయం అవుతున్నాయి. ఎంతో మంది ప్రజలు వీధుల్లో జరిగే ఈ పండుగలో పాలుపంచుకుంటున్నారు. మురికిగా ఉండే పరిసరాలు జీవం పోసుకుని అందమైన కాన్వాస్ లుగా తయారవుతున్నాయి.