శ్రావణమాసం. పండగల సీజన్ వేడుకలో తళుక్కున మెరవాలి అంటే చక్కని చీరె, మ్యాచ్ అయ్యే జ్యువెలరీ .. సరే మరి ముఖాన్ని మరింత అందంగా మెరిపించే హెయిర్ స్టయిల్ మాటేమిటి ? ఉన్న జుట్టుతో ఎన్నో రకాల స్టయిల్ సాధ్యమా అంటే ఔను అంటున్నాయి. హెయిర్ ఎక్స్ టెన్షన్  క్లిప్పులు జుట్టు పలచగా ఉంటే ఎక్స్ టెన్షన్ లాంగ్ హెయిర్ క్లిప్ తగిలించుకోవచ్చు. ఒత్తయిన పొడవాటి జుట్టు కనిపిస్తుంది. ఎవరి సాయం లేకుండా మనంతట మనం తగిలించుకునే క్లిప్పులు ఇవి. చక్కని చీరె కట్టుకుని జుట్టు ఫ్యాషన్ గా ముడి వేసుకోవాలి అనుకుంటే ఎక్స్ టెన్షన్  క్లిప్పులు వచ్చాయి. వాలుజడ దగ్గర నుంచి ముచ్చటయిన కొప్పు వరకు ఈ హెయిర్ ఎక్స్ టెన్షన్ మ్యాజిక్  చేస్తాయి. నిజంగా ఒత్తయిన జుట్టు సొంతం ఏమో అనుకున్నట్లే ఉంటాయి. డ్రెస్సులను బట్టి శిరోజాల స్టయిల్ కూడా మారాలి అనుకొనే అమ్మాయిల కోసం ఎంతో ప్రత్యేకం ఈ క్లిప్ లు. జుట్టు చక్కగా దువుకొని క్లిప్ తగిలించటం మే ఆలస్యం !

Leave a comment