గంటకు ఒక కప్పు టీ తాగే వాళ్ళున్నారు  .అందుకే టీ కూడా తనని తాను మార్చుకుంటూ, కొత్త రుచులు చేర్చుకుంటుంది .ఎన్ని రకాల పూల టీలు ,టీ బ్యాగ్స్ రంగురంగుల టీ లతో విందు చేసుకుంటున్న టీ ప్రియుల కోసం కొత్తగా వచ్చాయి టి బాంబులు. చుసేందుకు గుండ్రంగా, ఒక రకంగా టీ బ్యాగుల్లాంటివే అయినా టేస్ట్  లో మాత్రం ఇంకాస్త ఎక్కువ రుచితో ఉన్నాయి  .టీ బ్యాగులు బయట పడేస్తాం కానీ బాంబులు మాత్రం ఏవీ మిగిల్చావు వేడి నీళ్ళలో వేస్తే కరిగి టీ గా మారి పోతాయి. రకరకాల ఫ్లేవర్స్ తో వచ్చే టీ బాంబులు ట్రావెల్ ఫ్రెండ్లీ. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోవచ్చు. గ్రీన్ టీ, జింజర్ టీ, ఛమేలి టీ వంటివి టీ బాంబ్ ల రూపంలోకి మారాయి.పంచదార, టీ పొడి, కార్న్ సిరప్ లతో ఇవి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. గ్లిట్టర్సీ తో మెరిసే టీ బాంబులు ఉన్నాయి. అవి ఎడిబుల్ గ్లిట్టర్లే ఈ బాంబు లో రకాలన్నీ వందల కొద్ది వీడియోల్లో అప్ లోడ్ అవుతున్నాయి. వేడినీటి లోనో, పాలలోనో వేస్తే మొత్తం కరిగిపోయి అద్భుతమైన టీ తయారవుతుంది. ఈ గుండ్రని బాంబ్ రూపంలో కనిపించేదే పంచదార పాకంతో చేసిందే .పంచదార పాకం పట్టి అందులో కార్న్ సిరప్ వేసి ఆ మిశ్రమాన్ని గుండెని మౌల్ట్ లో వేసి చల్లారాక రెండుగా విడదీసి అందులో టీ పొడి లేదా ఆకులు వేసి ఈ రెండింటిని అతికిస్తే బాంబు తయార్ .ఇవి ఇంట్లో చేసుకోదలచుకుంటే బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. చాలా తేలిక కూడా తయారీ చక్కని ఫ్లేవర్స్ తో వస్తున్న ఈ టీ బాంబ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి .

Leave a comment