Categories

స్వెత్లానా అలెక్సీయెవిచ్ బెలారసియకు చెందిన రచయిత్రి.1948వ సంవత్సరంలో యుక్రేన్లో జన్మించింది. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. స్కూలు పత్రికలోనే స్వెత్లానా రచనా వ్యాసంగం మొదలైంది.మిన్స్క్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదివి,నేమ్యాన్ సాహిత్య పత్రికలో విలేఖరిగా చేరి అందులోనే కాల్పనికేతర విభాగానికి అధిపతిగా పనిచేసింది. ఆమె రచనల్లో ఐ హావ్ లెఫ్ట్ మై విలేజ్, ద బాయ్స్ ఇన్ జింక్, ఎన్ చాంటెడ్ విత్ డెత్ మొదలైనవి చాలా ప్రఖ్యాతి చెందాయి సమకాలీన ప్రపంచంలో బాధల్ని, సాహసాల్ని వినిపించే ఆమె రచనలకు 2015లో స్వెత్లానాకు నోబెల్ బహుమతి ప్రకటించారు నిర్వాహకులు ఆమె రచనలు బ్రహాండమైన బృందగానాల వంటివి అంటారు మేధావులు.