మొదటి నుంచి నేను సన్నగానే ఉండేదాన్నినాకు వ్యయామాలు అవసరం లేదనుకున్నా అంటుంది పూజా హెగ్డే. అరవింద సమేత సినిమా సక్సెస్ తర్వాత హౌస్ ఫుల్-4లో చేస్తుంది పూజా. వ్యయామం అంటే ఫిట్ గా ఉండేందుకు అని సినిమాల్లోకి వచ్చాకే అర్ధమైంది. మొదట్లో ముందుకు వంగినా కాలి వేళ్ళు కూడా టచ్ చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు వ్యయామం నా హాబీ. బోర్ కొట్టకుండా రోజు కొత్తవి చేస్తా. సైలేట్స్ నా హాబీ. సైలేట్స్,క్వాలిసైనిక్స్ ,కిక్ బాక్సింగ్, క్రాస్ ఫిట్ ,ఏరియల్ స్కిల్స్ ఎప్పుడు కొత్తవి మారుస్తా. కొన్ని ఫిట్ నెస్ కొన్ని ఫ్లెక్సిబిలిటి ఇస్తాయి. అందం కోసం కొన్ని నియమాలు తప్ప ఏడాదిగా పూర్తి బిజీ. ఒక సినిమా షూట్ ముగించి రాత్రంతా ప్రయాణం చేసి ఇంకా సినిమా షూటింగ్ కు వెళ్ళిన సందర్భాలున్నాయి. కెరీర్ బావుంది. కానీ నెమ్మదిగా నా వ్యక్తిగత స్వేచ్చ పోతుంది అంటుంది పూజా హెగ్డే.