Categories
చలి కాలంలో వేసుకొనే స్వెట్టర్లు కూడా ఇప్పుడు డిజైనర్ డ్రెస్ ల కింద మారిపోయాయి.స్వెట్టర్లు ఇప్పుడు ఎన్నో ఛాయల్లో దొరుకుతున్నాయి. అమ్మాయిలు స్కిన్నీ జీన్స్ ఇష్టంగా వేసుకొంటారు. దీని పైకి స్టేట్ మెంట్ కోట్ లేదా కాశ్మీరీ స్వెట్టర్ బావుంటుంది. లాంగ్ ఎలెన్ కోట్లు ,బ్లాంకెట్ స్కార్ఫ్, నిట్టెడ్ కోట్ లు ఇప్పుడు అమ్మాయిల వార్ట్ రోబ్ లో సగం స్థలం ఆక్రమిస్తున్నాయి. ఇక స్కార్ఫ్ ఎంతో స్టైల్ గా ఉంటాయి. అంత సౌకర్యం కూడా .ఎన్నో డిజైన్లు ప్రింట్ లలో దొరుకుతోంది. కాశ్మీరీ స్కార్ఫ్ ఏ డ్రెస్ కైనా చాలా చక్కగా ఉంటుంది.ఏ టూ వీలర్ పైన వెళ్ళాలన్న గ్లౌస్ లు సాక్స్ లు ఉండనే ఉన్నాయి. ఏ డ్రెస్ వేసుకొంటే ఆ కలర్ లో దొరికేస్తాయి. కనుక ఎలాంటి సందర్భంలో అయినా దూసుకుపోచ్చు.