నీహారికా,

భార్యా భార్తల మధ్యని గొడవలు అడ్డం పైన ఆవగింజలా దొర్లి పోవాలి కానీ అలా నిలువ వుండకుడదు అని అంటారు. చాలా ఇళ్ళల్లో చిన్ని చిన్ని గొడవలు మామూలే. వాటిని మరీ తెగే వరకు లాగకుండా ఎక్కడివక్కడ పరిష్కరించూకోవచ్చు. చేసిన పొరపాటు అంటా ఇద్దరు కలిసి చేసిన పొరపాటుని ఒక్కళ్ళ పైకి ఒక్కళ్ళు నేట్టుకునే ప్రయత్నం చేస్తారు. జరిగిపోయిన తప్పు లో పొరపాట్లు వెతికే బదులు సమస్య నుంచి బయట పడాలనే ఆలోచన చేస్తే మంచిదే కదా. రెండవ ముఖ్యమైన విషయం భాగస్వామికి చెప్పే  విషయాలు చెవిన పెట్టకపోవడం నిర్లక్ష్యంగా వుండటం చాలా తప్పు. ఇద్దరు పరస్పరం మాటాడుకుని ఏ సమస్యకైనా పరిష్కారం ఇచ్చుకోవాలి. అలాగే చిన్ని గొడవ జరగగానే ఇప్పుడో జరిగిపోయిన విషయాలు తవ్వుకుని పరస్పరం మాడుకుని, ఏ సమస్యకైనా పరిష్కారం ఇచ్చుకోవాలి. అలాగే చిన్ని గొడవ జరగగానే ఇప్పుడో జరిగిపోయిన  విషయాలు తవ్వుకుని గాయపరుచుకుంటారు. ప్రస్తుత సమయం గురించి మాత్రమే మాట్లాడుకుంటే పరిష్కారం త్వరగా దొరుకుతుంది. అలాగే ఎవరికి వాళ్ళు మన మాటే నెగ్గాలనే ధోరణి లో వాదనలు మొదలు పెడతా అది ఇద్దరి మధ్య దురాన్ని పెంచుతుంది తప్పా సమస్య పరిష్కార దిశగా వెళ్ళదు. ఒక్కళ్ళనొక్కల్లు  శ్రద్దగా గమనిచుకుని శాంతంగా విషయం గురించి మాట్లాడుకునే దిశగా అలవాటు చేసుకోవాలి.  ఇది  చెప్పినంత సులభం కాదు. కానీ తప్పనిసరిగా పాటించ వలసిన నియమం.

Leave a comment