నడకలతో పాటు సైక్లింగ్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు. అందులోనూ చక్కని ప్రకృతి,మంచి పరిసరాల్లో సైక్లింగ్ చేస్తే స్వచ్చమైన గాలిని పీల్చుకొనే అకాశం కూడా ఉంటుంది.వారానికి మూడు సార్లు సైక్లింగ్ చేస్తే మెదడు ఆలోచన శక్తి బాగా వృద్ది చెందుతోంది . సైక్లింగ్ లో శక్తంతా ఉపయోగిస్తాం కాబట్టి శరీరానికి మంచి వ్యాయామం లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కూడా.నిత్యం సైక్లింగ్ చేస్తే శరీరం లావు కాకుండా కాపాడుకోవటంతో పాటు గుండెజబ్బులు ,మధుమేహాం వంటి వాటిని నివారిస్తుంది కూడా. టీనేజర్లు వారంలో మూడు రోజులు కార్డియో వ్యస్కులర్ వ్యాయామం చేయాలి. ఆస్ట్రియో ఆర్టరైటిస్ ఉన్న వాళ్ళు కూడా సైక్లింగ్ చేయవచ్చు. ఇది కీళ్ళ గాయాలు తగ్గిస్తుంది. మానసిక శక్తిని పెంచుతుంది. ఒంటరిగానో నలుగురితో కలిసి కూడా ఈ సైక్లింగ్ చేయవచ్చు.
Categories