Categories
వైద్య రంగానికి ఎప్పుడు సవాల్ గానే ఉంది క్యాన్సర్ . మందులకు లొంగని ఈ వ్యాధి గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతోనే ఉన్నాయి. ఎన్నో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారించే పరీక్షలు ఉన్నాయి కానీ భవిష్యత్ లో క్యాన్సర్ ముప్పు ఉందో లేదో నిర్ధారించే పరీక్షలు లేవు. ఇప్పుడు పలు యూనివర్సిటీ పరిశోధకులు తల్లి పాలను పరీక్షించడం ద్వారా ఆ స్త్రీకి భవిష్యత్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 90శాతం వరకు గుర్తించవచ్చునంటున్నారు. ఈ పరిశోధన ఇప్పుటి వరకు పూర్తి స్థాయిలో నిర్ధారించ లేదు.ఒక వేళ ఈ పరీక్ష నిజమైతే భవిష్యత్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చునని పరిశోధకులు చెపుతున్నారు.