చక్కని సినిమాలు చూడాలి అనుకొనేవాళ్ళు ప్రవాస భారతీయుడు మనోజ్ నైట్ శ్యామలన్ తీసిన సినిమా చూడచ్చు. దర్శకుడిగా శ్యామలన్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సినిమా ది సిక్త్స్ సెన్స్ . ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమా చూడని అమెరికన్ పిల్లలు లేరు అంటారు . తొమ్మిది సంవత్సరాల కోల్ సియర్ అనే బాలుడికి ఆత్మలు కనిపించి మాట్లాడుతూ ఉంటాయి . తాము చనిపోయామని ఆత్మలు కనిపించి మాట్లాడుతూ ఉంటాయి . తాము చనిపోయామని ఆత్మలకు తెలియదు . ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ మాల్కమ్ క్రోవ్ దగ్గరకు తీసుకొస్తుంది పిల్లాడి తల్లి,నువ్వు భయపడ వద్దు ,అని ఒకప్పుడు మనుషులే కదా . వాటివల్ల ఏ ముప్పు ఉండదు అని పిల్లవాడికి ధైర్యం చెపుతాడు క్రోవ్ . అప్పటి నుంచి పిల్లవాడు ఆత్మలతో క్లోజ్ గా మాట్లాడుతూ వాళ్లకు సాయం చేస్తూఉంటాడు . చివరకు పిల్లాడితో స్నేహంగా ఉన్నా క్రోవ్ చనిపోయి ఆత్మనే నాని తెలుసుకొని ఆ పిల్లాడి ద్వారానే తన భార్యతో రెలెషిన్ సమస్యను తీర్చుకొని మాయమైపోతాడు .మనోజ్ సృషించిన భారతీయ ఆధ్యాత్మికత ,మానవీయత తాత్వికత ఉన్నా ఈ సినిమా చూడచ్చు .

Leave a comment