మెదడు క్యాన్సర్ గురించి చేసిన ప్రయోగాలతో తెలుగమ్మాయి కావ్య కొప్పరపు అమెరికా లోని డేవిడ్సన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ టాలెంట్ డెవలఫ మెంట్ అనే సంస్థ నుంచి ఫెలోషిప్ అందుకొంది .క్యాన్సర్ పైన మరిన్ని ప్రయోగాలు చేసేందుకు గానూ 50 వేల డాలర్లు ప్రోత్సాహకంగా అందుకొంది కూడా. ఇవేకాదు ఈ పద్దెనిమిది సంవత్సరాల కావ్య మూడేళ్ళ క్రితమే గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా రోబోటిక్ టెక్నాలజీ, యాప్ డెవలప్ మెంట్ వెబ్ డిజైనింగ్ లో పేద విద్యార్థిలకు శిక్షణ ఇస్తుంది. ఈమె ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ కంప్యూటర్ విజన్ అనే సబ్జెక్ట్స్ పై హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాను అభ్యశిస్తుంది. ఈ విద్య ఉచితంగానే విశ్వవిద్యాలయం అందిస్తోంది. టైమ్స్ జాబితాలో స్థానం సంపాదించింది విద్య.

Leave a comment