పెద్దవాళ్ళు తమ అనుభవ సారాన్నంతా రంగరించి పలికిన గొప్ప మాటలు ఈ సామెతలు. వీటినే లోకోక్తులు అంటారు. సామెతల్లో కుటుంబ జీవితం,ప్రజా జీవితం,ప్రపంచ పోకడలు ప్రతిఫలిస్తాయి. సామెత లేని మాట,ఆమెత లేని ఇల్లు లాంటిది అంటారు. అంటే సామెతలు జోడించని కబుర్లు విందు లేని ఇల్లు లాంటివి అంటారు పెద్దలు. అనేక మంది జ్ఞానం కలిపి ఒక ప్రసిద్ధ సత్యాన్ని ఉటింకించే సంక్షిప్త సారవంతమైన మార్గమే సామెత.
*అంత్య నిష్టురము కన్నా ఆది నిష్టురమే మేలు.
*ఆడ కత్తెరలో పోక చక్కలాగా.
*అడిగేవాడికి చెప్పే వాడు లోకువ.
*అడుగు తొక్కనేల కాలు కడగనేల.
సేకరణ
సి. సుజాత