Categories
సుగంధ ద్రవ్యాలకు రారాజుగా కనించే యాలకులు పరిమాణంలో చిన్నవి కానీ ఖరీదులో ఎక్కువే. నలుపు ఆకుపచ్చ రంగుల్లో దొరికే యాలకులు రెండిలో ఔషధగుణాలు బాగానే ఉన్నాయి. 4000 సంవత్సరాల నుంచి యాలకులు మన దేశంలో ఉపయోగిస్తూ ఉన్నారు. డిప్రెషన్ నుంచి ఉపశమనం కోసం యాలకులు ఎంతగానో ఉపయోగపడుతాయి.యాలకులు మరిగించిన టీ తీసుకోవటంతో ఒత్తిడి తగ్గుతుంది. వీటిలో ఉండే మాంగనీస్ మధుమోహాం రాకుండా అడ్డుకుంటుంది.నోటికి తాజాశ్వాస ఇస్తాయి యాలకులు. పుల్లని త్రేన్పులు తగ్గిస్తాయి.మిరియాలు ,శొంఠి యాలకులు జీలకర్ర పొడి మరిగించి అందులో బెల్లం వేసి తాగితే కడుపులో అసౌకర్యం తగ్గిపోతుంది. జీర్ణకోశ సమస్యలు ఎవైన రెండు యాలకులు ప్రతి రోజు నములుతూ ఉంటే తగ్గుతాయి.