Categories
![చిన్న అల్లం ముక్క, ఒక్క మిరపకాయ, నెయ్యి తో వున్న ఉప్మా అదిరిపోతుంది. అల్లం లో వున్న శక్తి అంతా ఇంతా కాదు. రెండు చెంచాల అల్లం రసం తీసి కొంచం తేనె కలిపి రెండు పూటలా తాగితే ఆస్తమ, జలుబు, దగ్గు తగ్గుతాయి. అల్లం రసంలో పిప్పిల్ల చూర్ణం, సైంధవ లవణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగితే అస్తమా చాలా వేగంగా తగ్గిపోతుంది. పన్ను నొప్పి పుడితే అల్లం ముక్క నమలాలి. అల్లం రసం, నిలువ వున్న నెయ్యి, కర్పూరం కలిపి చాతీ పై రాస్తే నిమోనియా ప్రభావం తగ్గుతుంది. అల్లం శరీరం లో వేడి నింపుతుంది. నదులు బలపడతాయి. జీరణ శక్తి పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు పోతాయి. రక్తం శుభ్ర పది శరీరం ఆరోగ్యవంతంగా వుంటుంది. అల్లంతో ఇన్ని ఉపాసమనాలున్నప్పుడు. దీన్నీ ఆహారంలో వీరివీరి గా వాడుకునే దారి వెతకాలి.](https://vanithavani.com/wp-content/uploads/2017/03/ginger.jpg)
ఆహారంలో రుచి, సువాసన కోసం,ఇంకా జలుబు, ఆర్థరైటిస్, మైగ్రేన్, రక్తపోటు వంటి అనేక వ్యాధుల చికిత్స కోసం వేలాది సంవత్సరాలుగా అల్లం వినియోగిస్తున్నారు.అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన అధికంగా ఉంటుంది.గర్భిణీ స్త్రీలలో వేవిళ్ళు వికారం తగ్గించేందుకు ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ళనొప్పులను తగ్గించేందుకు స్త్రీల నెలసరి కడుపు నొప్పి నియంత్రణకు అల్లం,లేదా ఎండిన అల్లం శొంఠి పనిచేస్తుంది .శ్వాస రోగ సంబంధిత వ్యాధులు కలిగించే వైరస్ లతో పోరాడి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.