శరీరానికి ఒత్తిడి కలిగించని వ్యాయామాల్లో ఏరోబిక్స్ ఒకటి, అందులో ఆక్వా ఏరోబిక్స్ మరింత సౌకర్యంగా ఉంటుంది. కీళ్ళ సమస్యలు వెన్ను సంబంధమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఒత్తిడి తక్కువగా,ఎక్కువ ఫలితం ఇచ్చే వ్యాయామంగా ఆక్వా ఏరోబిక్స్ ఎంచుకోవాలి. ఈ ఆక్వా ఏరోబిక్స్ చేసేందుకు ఈత వచ్చి ఉండాలని రూలేం లేదు తక్కువ లోతులో నిలబడి ఈ వ్యాయామాలు తేలికగా చేయచ్చు ఆక్వా ఏరోబిక్స్ కోసం ధరించే దుస్తులు సౌకర్యంగా ఉండాలి. ప్రత్యేకం ఈ వ్యాయామం కోసం ఉద్దేశించిన దుస్తులే వేసుకోవాలి లేకుంటే దుస్తులు వంటికి అతుక్క పోయి వ్యాయామం చేసేందుకు అడ్డుపడుతాయి. ఆరోగ్య సమస్యలు ముందుగా శిక్షకునికి చెప్పి సలహా తీసుకొని మరీ ఈ వ్యాయామం మొదలు పెట్టాలి.

Leave a comment