భారతీయ హస్తకళల సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యం అంటారు బృందా దత్. దేశంలో కళాకారులు ఏ మూల ఉన్నా అక్కడ నేను ఉంటాను అని చెప్పే బృందా కు హస్త కళల పట్ల అపారమైన గౌరవం. గుజరాత్లోని గాంధీ నగర్ లో మోరి డైనమిక్ డిజైన్ స్టూడియో స్థాపించి దేశం నలుమూలల ఉన్న క్రాఫ్ట్ కమ్యూనిటీ లతో కలిసి పనిచేస్తూ కళ ఎప్పటికీ నిలిచే లా వినూత్నమైన డిజైన్ రూపొందిస్తోంది బృందా దత్. ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న బృందా కు క్రాఫ్ట్ ప్రెన్యూర్  అవార్డ్ లభించింది.

Leave a comment