ఇంటా బయటా ద్విపాత్రాభినయం తో కలిగే వత్తిడి కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం ప్రస్నార్ధకమైంది. నిత్యం అనేకమైన పనులు ఇంటి చాకిరీ వృత్తి పరమైన బాధ్యతల వల్ల ఎక్కువ వత్తిడికి గురవుతున్నది మహిళలే అని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ వత్తిడి వల్ల హార్మోన్ల పనితీరు దెబ్బతింటోంది. ఫలితంగా సంతాన లేమి అధిక బరువు మధుమేహం గుండె సంబంధిత సమస్యలు స్త్రీలలో తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ధ్యానం ఒకటే మార్గం అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. అసలు ధ్యానమంటే ఏమిటి? శారీరిక మానసిక భావోద్వేగాల సమతుల్యతలకు మేలైన సాధనం. ధ్యానం అసలెలా చేయాలి. ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకుని ఆలోచనను శ్వాస పైన కేంద్రీకరించాలి. ఒక వస్తువు పై దృష్టి కేంద్రీకరించి మిగతా ఆలోచనల్ని పక్కన పెడితే మనసు నెమ్మదిగా ఆ వస్తువు పైన లగ్నం అవుతుంది. ఇలా ఏకాగ్రత అలవాటై సహజ సిద్ధంగా అభివృద్ధి అవుతుంది. మనసును ఏకాగ్రత చేయగలిగితే నిర్మాణాత్మకమైన ఆలోచనలు కలుగుతాయి. ప్రతికూలమైన ఆలోచనల నుంచి అంటే కోపం వేదన పని వత్తిడి ఇవన్నీ మనసులోంచి మాయం చేసి కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మంచి జరుగుతుందేమో ప్రయత్నిస్తే తప్పేముంది.
Categories
WoW

ధ్యానాన్ని అలవర్చుకుంటే శాంతి

Leave a comment