ప్రాచీన కాలంలో మహారాజులు,రాచరిక కుటుంబీకులు నవరత్నాల ఉంగరాలు ఆభరణాలు ధరించేవాళ్ళు . ఈనగలు అందాన్నిస్తాయి అలాగే ధరించిన వ్యక్తుల మానసిక భావోద్రేక స్థితి గతులను సమతౌల్య పరుస్తాయి . తొమ్మిది రకాల విలువైన రాళ్ళూ కూర్చిన ఆభరణాలు ఇవి . కెంపు,పచ్చ ,ముత్యం ,పగడం ,వజ్రం ,వైడూర్యం ,నీలం, పుష్యరాగం,పిల్లికన్ను రాయిలతో ఈ నవరత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించటం వల్ల అదృష్టం ,మంచి భవిష్యత్తు ఉంటాయని ఆశిస్తారు . సూర్యుని చుట్టూ ఉన్నా గ్రహాలకు ఇవి చిహ్నాలుగా అనుకొంటారు . జాతక చక్రాలతో ఇవి అనుసంధానం కలిగి ఉంటాయి . ఈ నవరత్నాలతో ఎప్పటి కప్పుడు కొత్త డిజైన్ లు వస్తూనే ఉంటాయి . నెక్లస్ లు ,బ్రష్ లెట్స్ ,చెవిదిద్దులు ఇతర నగల రూపంలో వీటిని ఇష్టంగా ధరిస్తున్నారు .

Leave a comment