చాలా తొందరగా నాలుగు భాషల చిత్రాల్లో నటించింది అనుపమ పరమేశ్వరన్ .ఇలాంటి అవకాశాలు ఎలా ఎలా వచ్చాయి ,కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారని అడిగితే వేరోకళ్ళతో ఎప్పుడూ పోల్చుకోవద్దని చెపుతాను. ఈ సినిమా రంగంలోనూ ప్రత్యేక పరిస్థితుల పనీ ఉండవు. బయట అన్ని రంగాల్లోని సూత్రాలే ఇక్కడ వర్తిస్తాయి. బయట చాలా మందిని గమనిస్తూ ఉంటాను మనం ఏం చేస్తున్నామో ,చేయాలో పక్కన బెట్టి ఇతరులు ఏం చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మనం ఒకటో పాఠంలో ఉంటే వాళ్ళు ఏడో పాఠంలో ఉండవచ్చు. వాళ్ళతో పోల్చి చూసుకోని లాభం లేదుకదా. మనదైన ప్రత్యేక ప్రతిభ మనకీ ఉంటాయి. దాన్ని సరిగా వినియోగంచుకొంటే మనము దేన్నైనా సాధించుకోగలుగుతాము అంటోంది అనుపమ పరమేశ్వరన్.

Leave a comment