Categories
ఒమిక్రాన్ కోవిడ్ వంటి వైరస్సే ఎప్పటికప్పుడు వేగంగా జన్యుపరంగా మార్పులు సంతరించుకోవడం ఆ వైరస్ లక్షణం. ఒక వైరస్ అంత వేగంగా మార్పులకు గురవుతున్నది అంటే (మ్యూటేషన్ కు) అది క్రమంగా బలహీనపడుతుందని అర్థం. త్వరలో ప్రమాద రహితంగా తయారవచ్చు అంటున్నారు అధ్యయనకారులు. ఒమిక్రాన్ ని గుర్తించగలిగే కిట్స్ మన దేశంలో తక్కువగా ఉన్నాయి కాబట్టి బాధితుల సంఖ్య తెలియటం లేదు కనుక ప్రాథమికంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. వైరస్ ల పైన పరిజ్ఞానం పెంచుకోవాలి అదనపు అపోహలు ప్రచారం చేయకూడదు మాస్క్ తీసేసి బయట స్వేచ్ఛగా తిరగటం ప్రమాదం.