స్క్రీన్ పైన దేవకన్యల్లా వుండే హీరోయిన్సే అంత అందంగా వుండేందుకు ఏం తింటారు? అందం కోసం ఏ జ్యగ్రత్తలు తీసుకుంటారో అందరికి కుతూహలమే. ఇవన్నీ మాములు అమ్మాయిలు కూడా చేయొచ్చు ఓపిక ఉంటే. బాలీవుడ్ స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ ప్రతి రోజు ఫేషి యల్, అలాగే ప్రతి రాత్రి క్లెంసింగ్, టోనింగ్, మాయిశ్చురైజింగ్ వంటికి తప్పకుండా చేయించుకుంటుంది. నెలకో సారి జుట్టుకు స్విట్ ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె, షికాయా కలిపి పట్టించి శిరోజాలు ఆరోగ్యంగా వుండేలా చూసుకుంటుంది. సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళదు. కెమికల్స్ కలిసిన ఉత్పత్తులు, ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కు దూరంగా వుంటుంది. పాలను యాస్ట్రీంజెంట్ గా వాడుతుంది. సున్ని పిండి పెరుగు ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. ప్రతి రోజు రెండు గంటలకొ సారి కొబ్బరి నీళ్ళు తాగుతుంది. ఐడు సార్లు లైట్ మీల్స్, బ్రేక్ ఫాస్ట్ లో మూడు ఎగ్గ్ వైట్స్, తృణ ధాన్యాలతో చేసే ఫారిద్జ్ లంచ్ లో బ్రౌన్ రైస్, కూరగాయాలు, పప్పు, పెరుగు తో భోజనం చేస్తుంది. చికెన్,ఎగ్స్ చేపలు, వెజిటేబుల్స్, చపాతీ భోజనం లో ఉండేలా చూస్తుంది. ఎప్పడు వీలైతే అప్పుడు నట్స్ తింటుంది.

Leave a comment