కోస్తా తీరా ప్రాంతాల్లో పగడాల నగలు ఎప్పుడూ ఎవ్వర్ గ్రీన్ . ఈ పగడాలను బంగారు అల్లికలో మెడ నిండా నెక్లస్ మాదిరిగా నడుము వరకు పొడవైన బంగారు ముడుల మధ్య పొదిగిన గొలుసులు మళ్ళీ ప్యాషన్ వరుసలో ముందున్నాయి . వీటికి కెంపులు ఇతర విలువైన రాళ్ళు పొదిగిన పెండెంట్ లో నెక్లస్ ల్లా తయారు చేస్తారు . ఈ పెండెంట్ లలో హంసలు ,నెమళ్ళు ,దేవతా మూర్తులు గుండ్రని బంగారు పతకాలల్లొ బంగారు గజ్జెలలో చాలా బాగుంటాయి . కోస్తాల్లో ధరించే బంగారు నాణేం లాటి కొప్పుల పై ధరించే నగను చెవి దుద్దులుగా మార్చేశారు . దేవతా మూర్తులు చెక్కిన ఈ నగిషీ కేరళ ,కర్ణాటక మహిళల చెవి పైన ధరిస్తారు . ఇవి రుబీలు ముత్యాలు కలసుకొని యాంటిక్ నగలై పోయాయి .

Leave a comment