Categories
ఉత్తరాఖండ్ చమోలి జిల్లా జోషి మత్ ప్రాంతంలో దౌలీ గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది .గంటలోపే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సమాచారం అందింది వెంటనే రుషీ గంగ తపోవన్ ప్రాంతాలకు రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు బెటాలియన్ లను పంపించాను డెహ్రాడూన్ నుంచి నా టీమ్ తో మేము బయలుదేరి పోయాము ప్రతి అడుగు ఎంతో కష్టమైంది అని చెప్తున్నారు డిఐజి అపర్ణ కుమార్ గంగా ప్రవాహానికి వంతెన కూలి పోవటంతో 13 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి .వారందరికీ తాగునీరు ఆహారం హెలికాప్టర్ ద్వారా మా దళాలు అందించాయి. ఇంత విషాదం ఎప్పుడూ చూడలేదు నా కెరియర్ లో అత్యంత వేదన కలిగించిన ఆపరేషన్ ఇది అన్నారు అపర్ణా కుమార్. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాలు అధిరోహించిన తొలి మహిళ పోలీస్ ఈమె ఫిబ్రవరి ఏడవ తేదీన జరిగిన జలవిలయం లో ఎందరినో కాపాడారు ఆమె.