![](https://vanithavani.com/wp-content/uploads/2020/03/Microfiber-Fabric-Rapid-Drying-Hair-Towel-Thick-Absorbent-Swimming-Bath-Shower-Cap-Fast-9-Colours.jpg)
జుట్టు తడి ఆరేందుకు హెయిర్ డ్రయిర్ లు వాడుతుంటే జుట్టు పొడిబారి పోయిందని చెపుతారు ఎక్స్ పర్డ్స్. డ్రయర్ల వాడకం సురక్షితం కాదు ,ఒక్కసారి ఆ డ్రయ్యర్ లో జుట్టు చిక్కుకోవటం ,లేదా ఆ వేడికి జుట్టు దెబ్బతినవచ్చు కూడా . అలా డ్రయ్యర్ కాకుండా క్షణాల్లో ఎలాంటి హాని చేయని జుట్టును ఆరబెట్టే హెయిర్ టవల్ ఒకటి మార్కెట్ లోకి వచ్చింది . దాన్ని రాఫిడ్ డ్రయింగ్ హెయిర్ టవల్ అంటారు . ఈ టవల్ ను తలకు చుట్టుకొంటే క్షణాల్లో జుట్టు పొడిగా అయిపోతుంది . ఈ టవల్ లో అమర్చిన ప్రత్యేకమైన మైక్రో ఫైబర్లు జట్టులోని తడిని క్షణాల్లో పీల్చేసుకొంటాయి . శిరోజాలు పాడవకుండా ఆరోగ్యంగా ఉంటాయి . ఎవరైనా సులభంగా వాడుకోవచ్చుట ఈ టవెల్ ని . ఆఫీస్ కు త్వరగా తయారవ్వాలి అనుకొనేవాళ్ళు ఈ టవల్ ని ఆర్డర్ చేయచ్చు .