దక్షిణ పోలెండ్ లోని ఏలిఙ్కా సాల్డ్ మైదానం ప్రపంచంలో అత్యంతా ప్రాచీనం . 2007 దాకా ఇక్కడ తవ్వకాలు జరిగాయి భూమికి 327 మీటర్ల అడుగున ఉన్న ఈ ఉప్పుగని యునెస్కా వరల్డ్ లిస్ట్ ఆఫ్ నాచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ లో ఉంది . మైనింగ్ టెక్నాలజీ పరికరాలు ఎక్విప్ మెంట్స్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి . గని తవ్వకం దారులు దాన్ని ఎంతో సుందర ప్రదేశంగా తీర్చి దిద్దారు . శిల్పాలు ,ప్రార్థన మందిరాలు ,పూజ విగ్రహాలు ఉంటాయి . ముఖ్యంగా 135 మీటర్ల లోతులో ఒక శానిటోరియం ఉంది ఆస్తమా ఎలర్జీలతో ఇబ్బంది పడే వారు చికిత్స కోసం ఇక్కడకు వస్తారు . ఈ ఉప్పుగని ని ప్రతి సంవత్సరం 17 లక్షల మంది వరకు సందర్శిస్తారని అంచనా . ఇక్కడ శాస్త్రీయ సంగీతం కచేరీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు .

Leave a comment