పెంపుడు జంతువుల కోసం ఎన్నో స్పాలు,రెస్టారెంట్స్ ,బ్యూటీ సెలూన్స్ ఉన్నాయి . ఇప్పుడు డే కేర్ సెంటర్స్ కూడా వచ్చాయి . కేర్ సెంటర్,బోర్డింగ్ లతో పాటు పెట్ యానిమల్ కేఫ్ లు మొదలయ్యాయి . హైద్రాబాద్ లోని గచ్చిబౌలి లో కేఫ్ డిలోకో ను సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని నిర్వహిస్తున్నారు . ఈ కేఫ్ లో కుక్కల కోసం ప్రత్యేక కిచెన్ ఉంది . కుక్క పిల్లలకు బర్త్ డే పార్టీలు కూడా ఆరెంజ్ చేస్తున్నారు . ఈ కేఫ్ ద్వారా వచ్చే ఆదాయం వీధి కుక్కల ఆరోగ్యం సంరక్షణ కు ఖర్చు పెడతారు . వీధి కుక్కల్ని దత్తత తీసుకొంటారు . జంతువులు ,ప్రకృతి పైన ప్రేమ పెరగాలని భాద్యత లోనే ఈ కేఫ్ నిర్వహిస్తున్నాం అంటారు నిర్వాహకులు .

Leave a comment