సేంద్రీయ పసుపు సాగుతో గ్రామాల్లో 900 మందికి ఆదాయ మార్గం చూపుంచిన మేఘాలయకు చెందిన ట్రినిటీ సాయొ కి పద్మశ్రీ లభించింది . మేఘాలయా లోని ములేహ్ అనే చిన్నఊరు ఆమె స్వగ్రామం . ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు . రైతులను కూడగట్టి సహకార సంఘం ఏర్పాటు చేసి ,పసుపు కొమ్ములు ఆరబెట్టి మిల్లులో పసుపుగా మర్చి ఫ్యాకింగ్ చేయటం అలవాటు చేశారు . ఇప్పుడు రైతులు తమ పంట ఉత్పత్తులు దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఆ ఆదాయంతో సుఖంగా జీవిస్తూ పిల్లలను ఉన్నత విద్య ను చదివించు కొంటున్నారు . గ్రామీణ మహిళల ఆదాయం మూడు రేట్లు పెంచేలా కృషి చేసినందుకు ట్రినిటీ సాయొని ఈ అవార్డు వరించింది .