కర్నాటక లోని అందోలా తాలుకా హొన్నోలి గ్రామానికి చెందిన తులసి గౌడ్ ను ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అంటారు. ఇప్పుడు తులసికి 76 సంవత్సరాలు. అరవై సంవత్సరాలుగా అడవిలో ఆమె 40 వేలకు పైగా చెట్లు పెంచింది. చిన్న తనంలోనే గోవింద్ గౌడ్ తో ఆమెకు వివాహం జరిగింది. కొన్నాళ్ళకే ఆయన చనిపోయాక అడవిలో తాత్కాలిక ఉద్యోగి గా చేరి పోయింది తులసి ఆ చెట్ల పెంపకం పరి రక్షణ లోనే జీవితాన్ని గడిపిన తులసి ప్రతి మొక్క,దాని లక్షణం,పెంపక విధానం,ఆ మొక్కలో ఔషధగుణాలు అన్ని తెలుసు శాస్త్రవేత్తలు కూడా కూడా ఆమె వృక్ష విజ్ఞానానికి ఆశ్చర్య పోయారు. ఈ వన నారి కి ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారం అందింది. గతంలో ఆమెకు ఇందిరా ప్రియదర్శిని, మిత్ర రాజ్యోత్సవ అవార్డ్ ,కవిత మెమోరియల్ పురస్కారాలు అందాయి.