భారత హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ ను పద్మశ్రీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం . ఆమెది హరియాణా లోని షాబార్ . తండ్రి రిక్షా కార్మికుడు . ఆమెకు హాకీ క్రీడ పైన ఆశక్తిని గమనించి ప్రోత్సహించారు తల్లిదండ్రులు . రైల్వేలో జూనియర్ క్లర్క్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది రాణీ . అన్ని అవరోధాలను దాటుకొంటూ ఆటలో మేటిగా నిలిచి రాణీ ఇప్పటి వరకు 200 పైగా మ్యాచ్ లు అడి జట్టుకు ఎన్నో విజయాలు సంపాదించి పెట్టింది . 36 ఏళ్ళ తరువాత రియో ఒలింపిక్స్ కు ఈ సంవత్సరం జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కు మహిళా హాకీ జట్టు అర్హత సాధించటం వెనుక రాణి కృషి ఎంతో ఉంది . 2016 ,హాకీ ప్రపంచ కప్ లో ఆడిన పిన్న వయస్కురాలిగా రికార్డ్ ,2016 అర్జున్ అవార్డు అందుకుంది కెప్టెన్ రాణీ .

Leave a comment