Categories
ఒత్తయిన జుట్టు కోసం ఉల్లిరసం ట్రైయ్ చేయమంటున్నారు నిపుణులు . ఉల్లిరసంలోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకు తోడ్పడే ఏoజైములను ప్రేరేపిస్తుంది . జుట్టు రాలకుండా ,చిట్లిపోకుండా చూస్తుంది . యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేసే కెటిలైట్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది . తర్వాత జుట్టు తెల్లబడనీయదు . ఉల్లిరసంలోని బాక్టీరియల్ గుణాలు తో చుండ్రు తగ్గిపోతుంది . ఉల్లిరసంలో దూది ముంచి తలంతా పట్టించి ఓ గంట ఆగి శంలు చేస్తే చాలు . ఇలా వారానికి మూడుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా వత్తుగా పెరుగుతుంది