చెవులు కుట్టించుకుని చక్కని ఆభరణాలు పెట్టుకోవడం ఏనాటిదో ఇప్పుడు ఈ పియరింగ్స్ ను కనుబొమ్మలు, బొడ్డు, పెదవులు, నాలుకకు కుడా చేయించుకుని నయా ట్రెండ్ సృష్టించారు అమ్మాయిలు. ఇప్పుడు హేలిక్సే అంటే చెవి పై భాగం ఇయర్ లోబ్స్ చెవి కింద భాగంలో కుడా కుట్టిన్చేసుకుంటున్నారు. కాలేజీలో ఫ్యాషన్ గా కనిపించాలనుకుంటే చెవి చుట్టూ చక్కని స్టుడ్స్ పెట్టించుకుంటున్నారు. టీనేజర్స్   ఈ మద్య చెవి మధ్య భాగంలో కొమ్బ్ పియర్స్ చేయించుకోవడం  కొత్త స్టయిల్, అలాగే ఈ స్టయిల్ ఇష్టపడి నొప్పి భరించలేం అనుకుంటే నో   పియర్స్ ఇయర్ రింగ్స్  మార్కెట్లో దొరుకుతున్నాయి.   జిగురు తో అంటించేసుకొవచ్చు. లేదా   క్లిప్ తో  పెట్టుకోవచ్చు అన్నమాట. మొత్తానికి చెవి   చుట్టూ అందంగా జ్యువెలరీ అలంకరించుకోవచ్చు అన్నమాట.

Leave a comment