నీహారికా ,

రోజుకు 12 గంటలే మేలుకుని ఉంటాం . ఈ కాస్త సమయం చదువుకు మిగతా పనులకే చాలవు. ఇంకా హాబీలు సృజనాత్మకమైన పనులు ఎక్కడ చేస్తాం అన్నావు. కనే చేసి తీరాలి. మనకెన్నో పనులతో క్షణం తీరదు. ఉన్న సమయం సరిపోదు. ఇన్ని పనుల మధ్య మనకు సంతోషాన్నిచ్చే పనులు మేధస్సుకు పదును పెట్టె పనులు చేయటం వల్ల  శారీరిక మానసిక శక్తులు పెరుగుతాయి. భాధ్యతలు పానుల్లాంటివే. ఈ హాబీలు కూడా. ఎంతోకొంత  సమయం కేటాయించాలి. మనసు శారీరం సేద తీరానికి ఇవెంతో అవసరం. పెయింటింగ్ గార్డెనింగ్ ఏదన్న కలెక్షన్ పాటలు డాన్స్ సోషల్ వర్క్ కొత్త భాషలు నేర్చుకోవటం  మన డ్రెస్ మనం డిజైనింగ్  చేసుకోవటం ఏదైనా కానీ ఆ అభ్యాసాన్ని వాయిదా వేయకూడదు. లేకపోతేనే రొటీన్ చాలా విసుగు కలిగిస్తుంది. నీ పనుల మధ్య ఏదైనా మనసుకి నచ్చే  కళకు మెరుగులు పెట్టుకోవటం ఎంత విశ్రాంతి. సృజనాత్మకతను వెలికి తీయటం దానికి సమయం కేటాయించటం చాలా ముఖ్యమైన పని. తెలుసా రిటైరయ్యాక కూడా సంగీతం నేర్చుకునేవాళ్ళు రచనలు చేసేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. జీవితం మొత్తం మనం డిజైన్ చేస్తేనే అందంగా ఉంటుంది ఏమంటావు ??

Leave a comment