ఈ సీజన్ లో ఆ ఆకుపచ్చ పండు కన్నులపండుగ్గా నోటికీ కంటికీ విందు చేస్తూ ఉంటుంది. ఇళ్లలో కూడా సులువుగా పెంచుకునే సీతాఫలాల నిండా చెప్పలేనంత కాల్షియం నిల్వలుంటాయి. కానీ వీటిని కొనే సమయంలో మిగతా పండ్ల తో పోల్చితే అదనపు శ్రద్ధ కావాలి. కాయ పండి గట్టిగ ఉండాలి. నొక్కితే బ్రేక్ అవకూడదు. సీతా ఫలం కళ్ళ మధ్య తెల్లని బూజు వంటిది అంటుకునే ఉంటే వాటిని కొనగూడదు. ఇవి ఫంగస్ ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. పండు పైన నల్లని మచ్చలు చుక్కలు వున్నా కొనద్దు. ఎల్లోయిష్ గ్రీన్ గా వున్నాయంటే లోపల పాడయి  పోయినట్లు లెక్క వీటిని ఒక్కసారిగా ఎక్కువగా కొనకూడదు. త్వరగా పాడై పోతాయి. ఒకటి రెండు రోజులకు మించి తాజా తనం ఉండదు. సీతాఫలాన్ని సాధారణ గది  ఉష్ణోగ్రతలు ఫ్రూట్ నెట్ లో ఉంచుకోవాలి. ఇతర క్రిముల్ని బాగా ఆకర్షిస్తాయి. సీతాఫలాల్లో విటమిన్ ఏ  మెగ్నీషియం పొటాషియం ఫైబర్ విటమిన్ బి 6 కాల్షియం విటమిన్ సి ఐరన్  వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి. శీతాకాలపు పండు ఇది

 

 

Leave a comment