కాఫీ పరిమళం ముక్కుకు సోకితేనే నిద్ర లేచేవాళ్ళు కోట్లమంది ఉంటారు . ఉదయాన్నే వేడి పొగలు కక్కే కాఫీ తాగటం ,కమ్మని కాఫీతో రోజును ప్రారంభించటం ఎంతో బావుంటుంది కూడా . కానీ ఇప్పుడిదే కాఫీ తో సందేశాలు కూడా పంపవచ్చు . కాఫీ షాపుల్లో కాఫీ పైన స్మైలీ,హార్ట్ వంటివి డిజైన్ లు పెడుతూ ఉంటారు . ఇప్పుడు ఈ విదానం మరింత అప్ డేట్ చేశారు . కాఫీ డికాషన్ పైన పాల నురగను ఒక క్రమ పద్దతిలో పోస్తూ రకరకాల డిజైన్ లు సృష్టిస్తారు . కాఫీ మీద పాలు డికాషన్ కలగలసి బొమ్మలు వచ్చేలా చేసే ప్రక్రియను లాటి ఆర్ట్ అంటారు . మార్కెట్ లో కెరోలాటి ఆర్ట్ షీట్స్ జిలాటిక్ లో చేసినవి ఉంటాయి . వాటిని వేడి కాఫీ లేదా టీ పైన వేస్తే అవి కరిగి బొమ్మ వేసినట్లుగా అచ్చవుతాయి . వీటికి ప్రత్యేకమైన రుచి ఏమీ ఉండదు .

Leave a comment