మన శరీరం బరువులు అరవై శాతం నీరే ఉంటుంది. అనేక జీవక్రియలకు నీరు అవసరం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు,రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేసేందుకు నీరు అవసరం అంచేత తగిన మోతాదులో నీళ్లు తాగాలి. ముఖ్యంగా ఎండ తేమ ఎక్కువగా ఉన్నపుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. భోజనానికి అరగంట ముందు ఓ గ్లాస్ నీళ్లు తాగితే కేలరీలు,పరిమితిలో ఉంచవచ్చు తగినన్ని నీళ్లు తాగితేనే వ్యర్ధాలు బయటికి పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వేసవి కి మరిన్ని నీళ్లు తాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు చాలా అవసరం.

Leave a comment