కిచకిచమంటూ ఇళ్ళలో వాలే పిచ్చుకలు ఇప్పుడు చూద్దామన్న కనిపించడం లేదు . పచ్చని చెట్లు వాటిపై కట్టుకొన్న గుళ్ళు ఏవీ లేవు . ఆవాసాలు లేక అంతరించి పోతున్న పిచ్చుకల కోసం బెంగుళూర్ నివాసి ఇంద్రపాల్ బాత్రా తన ఇంటినే పిచ్చుకల కోసం తీర్చిదిద్దాడు . అయన ఇంటి ఆవరణలో 200 పిచ్చుకల వరకు గుళ్ళు ఉన్నాయి . ఇంటి ఆవరణలో గుబురుగా పెరిగే బోగన్ విల్లే శమీ వంటి మొక్కలు నటించాడు . అయన కుటుంబ సభ్యులు కూతురు అమిత్ బాత్రా కూడా పిచ్చుకల కోసం గుళ్ళు ఏర్పాటు చేయించింది . మొక్కలను పెంచడంలో ఇంద్రపాల్ కు సాయం చేస్తోంది న. బెనారస్ వెళ్ళీ చాలా మంది బాత్రా ఇల్లు చూసేందుకు వెళుతున్నారు . అక్కడికి పోతే అన్ని పిచ్చుకల కిలకిలాలే..

Leave a comment