‘ కూకే హత్ కా ఖానా ‘ అంటుంటారు. మానవ జన్మ ఎత్తిన 46 ఏళ్ల కు మొదటిసారి మా అమ్మ చేతి ముద్ద తిన్నాను అంటూ సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మ చేసిన ఫ్రైడ్ రైస్ ఫోటో పెట్టింది ట్వింకిల్ ఖన్నా. వాళ్ళ అమ్మ డింపుల్ కపాడియా కు వంట వచ్చు కానీ చేసే అవసరమే రాలేదు ఈ లాక్ డౌన్ పొడిగింపు పుణ్యమా అని డింపుల్ వంట చేసి కూతురికి తినిపించారు. దీన్ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ట్వింకిల్ సంతోష పడిపోతే, లక్షల మంది దీనికి లైక్ లు ప్రసాదించి ఆనందించారు. నిజమే కదా ఎవరి అమ్మ చేతి ముద్దయినా వాళ్ళ పిల్లలకు మధురమే కదా.

Leave a comment