Categories
వాల్డ్ డిస్నీ నుంచి వస్తున్న యానిమేషన్ చిత్రం ఫోజెన్ -2 లో ప్రధాన పాత్ర అయిన యువరాణి ఎల్సా చిన్నప్పటి పాత్రకు మహేష్ బాబు కుమార్తె ఘట్టమనేని సితార డబ్బింగ్ చెప్పింది తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్ర విడుదల అవుతోంది. నాకు ఎల్సా పాత్ర అంటే చాలా ఇష్టం. ఫ్రోజెన్ లో ఆ పాపను చూశాను . నాకు చాలా ఇష్టం. అందుకే డబ్బింగ్ చెప్పాను అన్నది సితార చిన్న వయసులోనే ఈ అవకాశం రావటం నాకు సంతోషం కలిగింది పైగా ఈ పాత్ర అంటే సితారకు చాలా ఇష్టం దానికోసం పాప ఎలాటి శిక్షణ తీసుకోలేదు అన్నది నమ్రత. మొత్తానికి ఈ స్టార్ కిడ్ కు మంచి అవకాశమే వచ్చింది.