పిల్లలున్న ఇంటికి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఎదో స్వీట్స్, పిల్లలకు పనికి వచ్చే వస్తువులో, బొమ్మలో పట్టుకుపోతాం. అలా ఎదో ఒక్కటి తిసుకుపోకుండా వాళ్లకు ఎలాంటి కానుకలు ఇస్తే బావుంటుందో ఆలోచిస్తే మొదటగా మనం ఇచ్చే బొమ్మలు సరే పర్లేదు. ఒకవేళ బొమ్మలు వద్దనుకుంటే పిల్లలు మరీ చిన్నవాళ్ళు అయితే వాళ్ళకు ఉపయోగించే డైపర్లు, నూనెలు, పౌడర్లు కూడా ఇవ్వొచ్చు. వెయ్యికి మించి వాళ్ళకోసం ఏదయినా కొనాలంటే ఆ డబ్బుకు సరిపడా నేషనల్ సెక్యూరిటీ బ్రాండ్స్ కొనివ్వొచ్చు. ఇవి పిల్లల భవిష్యత్తు అవసరాలకు పనికివస్తాయి. ఐదేళ్ళ పిల్లలు వుంటే విజ్ఞానాన్ని వినోదాన్ని పంచే ఆటవస్తువులు, టెన్నీస్ రాకెట్లు, స్కిప్పింగ్ రోప్, జాగింగ్ షూ ఇస్తే ఎంతో ఆనందిస్తారు. ఇక పది పన్నెండేళ్ళ వాళ్ళయితే వాళ్ళ ఆసక్తులు అలవాట్లు మారిపోయి. వాళ్ళకు మంచి పుస్తకాలే మొదటి ఎంపిక.
Categories